ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
సినిమాల్లోనూ డిజిటల్‌ ట్రెండ్‌

సినిమా రంగం పుట్టి ఎన్నో దశాబ్దాలు పూర్తయిన తరువాత ఇప్పుడు ఆ రంగంలో వినూత్న మార్పులు రానున్నా యి. ఈ మార్పులు యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించను న్నాయి. సినిమా రంగంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫిల్మ్‌స్థానంలో డిజిటల్‌ మీడియా ఇప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు. హాలీవుడ్‌లో ఎప్పుడో ప్రారంభమైన ఈ డిజిటల్‌ మీడియా ఇప్పుడు తెలుగు వెండితె రను కూడా ఆక్రమించనుంది. ఇటీవల విడుదలైన ‘ఈనాడు’ సినిమా ఇం దుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అతితక్కువ ఖర్చుతో అత్యంత నాణ్య తతో కూడిన సినిమాలను చేయడం కేవలం డిజిటల్‌ మీడియాకు మాత్ర మే సాధ్యమవుతుంది. ఒక సినిమాను నిర్మించేందుకు లక్షల రూపాయల విలువైన ఫిలిం రీళ్లను ఉపయోగిస్తుంటాం. అయితే ఇపుడు వస్తున్న డిజి టల్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ సహాయంతో రీళ్ల కోసం చేసే లక్షల రూపాయాల వ్యయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంది.

రీళ్లు లేకుండా నేరుగా మెమొరీ స్లాట్‌లోనికి రికార్డింగ్‌ చేసుకోవచ్చు. దానిని నేరుగా కంప్యూ టర్‌లోకి తీసుకుని ఎడిటింగ్‌ పూర్తి చేయవచ్చు. ఎడిటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్‌‌స, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, కలర్‌ కరక్షన్‌ వంటివి పూర్తి చేసుకున్న తరువాత ఆ సినిమాను నేరుగా ఫిల్మ్‌లోకి మార్చుకోవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల నిర్మాతలకు డబ్బులు ఆదా కావడమే కాక దర్శకులకు కూడా నచ్చి నన్ని టేక్‌లు తీసుకుని మంచి నాణ్యమైన సినిమాను చిత్రీకరించేందుకు సహాయపడుతుంది. డిజిటల్‌ మీడియా ప్రవేశంతో ఖర్చు బాగా తగ్గుతు న్నందున చిన్న నిర్మాతలు కూడా సినిమాలను తీసేందుకు ముందుకువచ్చే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు రీళ్లపై పెట్టే డబ్బును కూడా సినిమా నిర్మాణంపై పెట్టడం వల్ల మరింత నాణ్యమైన సినిమాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

ఉపాధి అవకాశాలూ మెరుగు...
సినిమాల సంఖ్య పెరగడం, కెమెరాలు, ఎడిటింగ్‌ సూట్‌ల సంఖ్య కూడా బాగా పెరగడం వల్ల ఎక్కువ మంది యువకులకు సినిమా రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. దీనికి అనుగుణంగా డిజిట ల్‌ ప్రొఫెషనల్స్‌ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఫిల్మ్‌ కెమెరాలకు, ఫిల్మ్‌ ఫార్మాట్‌కు అలవాటు పడిన చాలామంది ప్రొఫెషనల్స్‌ కూడా ఇప్పు డు డిజిటల్‌ రంగంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు ధీటుగా తమ స్కిల్స్‌ ను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం వీడియో ఎడిటింగ్‌లో డిజిటల్‌ రంగం ప్రారంభమైన కొత్తలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కోవడం అప్పటి నిపుణులకు తలకుమించిన భారంగా మారింది. అదే సమస్య ఇప్పుడు సినిమా రంగానికి కూడా వచ్చే అవకాశం ఉంది.

డిజిటల్‌ ప్రత్యేకత ఇదీ...
డిజిటల్‌ కెమెరాతో షూటింగ్‌ చేసేటపుడు ఫుటేజ్‌ మొత్తం మెమొరీ స్లాట్‌లో రికార్డ్‌ అవుతుంది. ఆ రికార్డ్‌ అయిన సీన్‌లను మన హార్డ్‌ డిస్క్‌లో కి కాపీ తీసుకుంటాం. కాపీ పూర్తయిన తరువాత మెమొరీ స్లాట్‌లోని విజువల్స్‌ను డిలేట్‌ చేసేస్తాం.పొరపాటున కాపీలో ఏదైనా తేడా జరిగినా, కాపీ చేసిన విజువల్స్‌కు వైరస్‌ సోకినా షూటింగ్‌ చేసిన మొత్తం విజువ ల్స్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు కెమెరా మెన్‌కు, కెమెరా అసిస్టెంట్‌కు కూడా డిజిటల్‌ విజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే పోస్ట్‌ప్రొడక్షన్‌ చేసే ఎడిటింగ్‌ సిబ్బందికి కూడా ట్రబుల్‌ షూటింగ్‌పై సంపూర్ణ అవగాహన అవసరం. ఓవైపు ఎడిటింగ్‌ చేసే పరిజ్ఞానంతోపాటు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల గురించి పూర్తిగా తెలిసిన మల్టీ ప్రొఫెషనల్స్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎడిటర్లుగా ఉన్న వారు తమ స్కిల్స్‌ను అప్‌డేట చేసుకోవడం, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారు ఆధునాతన టెక్నాలజీతోనే కెరీర్‌ను ప్రారంభించడం చాలా అవసరం.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు