|
|
హైదరాబాద్‌లో సల్మాన్ సందడి
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌కు విచ్చేశాడు. తన తాజా చిత్రం ‘వీర్’ ప్రమోషన్‌లో భాగంగా శనివారం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో సల్మాన్ సందడి చేశారు. తనను చూడడానికి ఎగబడ్డ అభిమానులకు హుషారుగా చేతులు ఊపుతూ ఆయన అలరించారు. కొంత మంది అమ్మాయిలకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిన సల్మాన్ మరికొంత మందికి ఆటోగ్రాఫ్ బహుమతిగా ఇచ్చారు. అభిమానుల తొక్కిసలాటలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ‘వీర్’ చిత్రం సినీ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను తీసుకువస్తుందని ఈ సందర్భంగా సల్మాన్ అన్నారు. తెలుగు వెర్షన్‌లోనూ ‘వీర్’ విడుదల కానుండడంతో ఇక్కడ ఆయన సందడికి ప్రాధాన్యత ఏర్పడింది. ‘ప్రేమ పావురాలు’ చిత్రం తర్వాత సల్మాన్ చిత్రం ఏదీ తెలుగులో రాలేదు. తాజా చిత్రంపై ఆయనకే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మొదట వీర్ తెలుగు హక్కులను దక్కించుకోవాలని చాలా మంది తెలుగు నిర్మాతలు పోటీ పడినప్పటికీ తెలుగు వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారని తెలుసుకుని వెనుకంజ వేసినట్లు సమాచారం.
|
|
|