ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
మిర్పూర్‌ టెస్ట్‌లో భారత్‌ విజయం

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను టీమ్‌ ఇండియా కైవసం చేసుకుంది. మిర్పూర్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. 2-0 తేడాతో బంగ్లాను క్లీన్‌ స్విప్‌ చేసిన ధోనీ సేన టెస్ట్‌ ర్యాంకింగ్‌లో అగ్ర స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

మూడు వికెట్ల నష్టానికి 228 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో బుధవారం నాలుగు రోజు ఆట కొనసాగించిన బంగ్లాపై టీమిండియా బౌలర్లు విరుచుకుపడ్డారు. భోజన విరామ సమయానికి 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌, పరుగులేమీ జోడించకుండానే చివరి వికెట్‌ సమర్పించుకుంది. పేసర్‌ జహీర్‌ఖాన్‌ ఒక ఓవర్‌లోనే నాలుగు వికెట్లు తీశాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (7/87) నమోదు చేశాడు.

రెండు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వికెట్లేమి కోల్పోకుండానే విజయం సాధించింది. ఈ పరుగులు కూడా బంగ్లా బౌలర్ల ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేయగా, భారత్‌ 544/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ టెస్ట్‌లో పది వికెట్లు తీసిన జహీర్‌ఖాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.


 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై