ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
'అందరి బంధువయ' ఆడియో విడుదల

శర్వానంద్‌, పద్మప్రియ జంటగా యుటోపియా ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై చంద్ర సిద్ధార్థ స్వీయదర్శకత్వంలో 'అందరి బంధువయ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. చిత్రం ఆడియో క్యాసెట్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఆవిష్కరించారు. తొలి క్యాసెట్‌ను తేజ కొనుగోలు చేశారు. ఆడియో సిడీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆడియో సిడీని కొనుగోలు చేసిన రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖా మంత్రి డి.శ్రీధర్‌ బాబు చిత్రం వీడియో లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుడు చంద్రసిద్ధార్థ రూపొందించిన 'అందరి బంధువయ' చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రతిభావంతుడైన చంద్రసిద్ధార్ధ ఒక చిత్రాన్ని నిర్మించమని సన్నిహితులు కోరుతున్నారని చెప్పారు.

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మాట్లాడుతూ ''తనదైన శైలిలో చిత్రాలు రూపొందించే చంద్రసిద్ధార్థ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుంది'' అని అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ చంద్రసిద్ధార్థను చిన్న దర్శకులలో పెద్ద దర్శకుడిగా పేర్కొన్నారు.

చిత్రదర్శకుడు చంద్రసిద్ధార్థ మాట్లాడుతూ ''పాటలు వినగానే చిత్రాన్ని చూడాలనే భావనను కలిగించే విధంగా సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ పాటలకు బాణీలు కట్టారు'' అని చెప్పారు.

ఆడియో విడుదల కార్యక్రమంలో నరేష్‌, ఆర్పీ పట్నాయక్‌, చిత్ర రచయిత్రి బలభద్రపాత్రుని రమణి, తదితరులు పాల్గొన్నారు.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు