|
|
ఈ నెలలో 'బెట్ ' విడుదల
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్, ప్రియమణి జంటగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన ఒక చిత్రాన్ని నిర్మాత తొండపు నాగేశ్వరరావు తెలుగులోకి 'బెట్ ' (దేనికైనా ఛాలెంజ్) పేరిట అనువదిస్తున్నారు. చిత్రాన్ని ఫిబ్రవరి మాసంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''స్నేహంలో స్వార్థముండదని విశ్వసించే ఒక యువకుడి జీవన గమనం ప్రధాన కథాంశంగా ఈ చిత్రం నిర్మితమైంది. ఆ యువకుడిగా భరత్ నటించారు. భరత్, ప్రియమణి మధ్య వచ్చే సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు.
'బెట్ ' చిత్రానికి కెమెరా: భూపతి, మాటలు: శశాంక్ వెన్నెలకంటి.
|
|
|