ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ఎన్టీఆర్‌ హీరోగా 'శక్తి' షూటింగ్‌ ప్రారంభం

ఎన్టీఆర్‌, ఇలియానా జంటగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.ధర్మరాజు సమర్పణలో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో నిర్మాత సి.అశ్వనీదత్‌ 'శక్తి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం జనవరి 28వ తేదీన హైదరాబాద్‌, గచ్చిబౌలిలో గల గోల్ఫ్‌ కోర్ట్‌ ప్రాంగణంలో ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు కృష్ణంరాజు హాజరయ్యారు. దర్శకులు వి.వి.వినాయక్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, శ్రీను వైట్లతో పాటుగా చిత్ర పరిశ్రమలో గల ప్రముఖ నిర్మాతలందరూ పూజా కార్యక్రమాలకు విచ్చేసి హీరో, దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

దేవుని పటాలకు ఎన్టీఆర్‌ నమస్కరిస్తుండగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్‌ చేశారు. పై సన్నివేశానికి కృష్ణంరాజు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత సి.అశ్వనీదత్‌, దర్శకుడు మెహర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ''నందమూరి తారకరామారావు వైజయంతీ మూవీస్‌కి నామకరణం చేశారు. అదే రోజున 1975 జనవరి మాసంలో ఎన్టీరామారావు హీరోగా 'ఎదురులేని మనిషి' చిత్రాన్ని ప్రారంభించాం. ఆ ఎన్టీఆర్‌తో ప్రారంభించి నేటికి 35 సంవత్సరాల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో చిత్రాన్ని మొదలుపెట్టడం ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ''వైజంతీ మూవీస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్ర నిర్మాణ సంస్థతో సినిమా చేసే అవకాశం రావటం నాకు లభించిన అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్‌తో రెండవ సినిమా చేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నమాను. ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి జైపూర్‌, జోధ్‌పూర్‌, రాజస్థాన్‌లలో తొలి షెడ్యూల్‌, కాశ్మీర్‌, లడక్‌ ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్‌ జరిపి, హంపి, మైసూర్‌, హృశికేష్‌, ఢిల్లీ, ఆగ్రాలలో మూడవ షెడ్యూల్‌ జరిపి ఈజిప్ట్‌, కైరో, లండన్‌లలో చిత్రీకరించటంతో చిత్రాన్ని ముగిస్తాం. ఎన్టీఆర్‌ నటనాశక్తిని ప్రదర్శించే చిత్రంగా 'శక్తి' రూపొందనుంది'' అని చెప్పారు.

'శక్తి' చిత్రానికి మాటలు: సత్యానంద్‌, ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్‌, జె.కె.భారవి, తోటప్రసాద్‌, డి.ఎస్‌.కన్నన్‌, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌.


 సినీ నటుడు శ్రీకాంత్‌కు గాయాలు
 సయ్యాట
 జూ.ఎన్టీఆర్‌ కోటు, హ్యాట్‌ వేలం
 త్వరలో ఆయుధ పోరాటం
 ఓరిదేవుడా కాలం మారెరా
  పెద్దదర్గా సందర్శించిన తరుణ్‌
 దర్గాను సందర్శించిన నటుడు అక్షయకుమార్‌
 వడివేలుతో నిత్యానందపై సినిమా
 ‘ఖతర్నాక్’ ‌గాళ్‌?
 సహజీవన సంబరాలు?
 దర్శకుల పోరాటం ప్రారంభం
 బాంద్రా-వోర్లీ వివాదం మీడియా సృష్టే
 చిన్న సినిమాకోసం దర్శకుల పోరాటం
 సినీ పరిశ్రమ బంద్‌ లేదు: మురళీ మోహన్‌
 ఏకోపై ఇళయరాజా ఫిర్యాదు
 ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదుల ధర్నా
 15వ తేదీ నుంచి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
 'హైస్కూల్‌' సినిమాపై స్టే
 శ్రీకాంత్‌ హీరోగా సేవకుడు ప్రారంభం
 'సింహా' షూటింగ్‌కు తెలంగాణ కష్టాలు