|
|
నాగచైతన్యకు జంటగా కాజల్
'జోష్'ద్వారా హీరోగా ఆరంగేట్రం చేసిన నాగచైతన్య కొత్త చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. ఆ చిత్రంలో నాగచైతన్య సరసన కాజల్ నటించనుంది. నాగార్జునతో పలు విజయవంతమైన సినిమాలను నిర్మించిన డి.శివప్రసాదరెడ్డి ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.దర్శకునిగా అజయ్ భూయాన్ పరిచయమవుతున్నారు.
సంబంధిత వివరాలను నిర్మాత వివరిస్తూ ఇది తమ సంస్థకు రజతోత్సవ సంవత్సరమని, ఈ సందర్భంగా నాగచైతన్యతో భారీ చిత్రం నిర్మిస్తూండడం సంతోషకరంగా వుందని చెప్పారు. ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రానికి అద్భుతమైన సబ్జెక్ట్ సిద్ధమైందన్నారు.
|
|
|