ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
భారత్‌కు మరో 8 స్వర్ణాలు

ఢాకా: 11వ దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఎనిమిదో రోజు 10 ఈవెంట్లకు పోటీలు జరగ్గా అందులో భారత్‌ ఎనిమిది స్వర్ణాలను సాధించింది. భారత్‌ 40 స్వర్ణాలు, 17 రజతాలు, 10 కాంస్యాలతో మొత్తం 67 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్‌ 31 పతకాలు (6 స్వ, 16 ర, 9 కా)లతో రెండో స్థానంలో ఉంది. స్విమ్మింగ్‌లో భారత్‌ 4 స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్‌ రెహన్‌ పొంచా 200 మీటర్ల వ్యక్తిగత మిడ్లేలో 2:12.06 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి భారత్‌కు స్విమ్మింగ్‌లో తొలి బంగారు పతకం అందించాడు. ఇక మిగిలిన స్విమ్మర్లలో సందీప్‌సెజ్వాల్‌, సుభా చిత్రంజన్‌, అరోన్‌ డీ‘సౌజాలు స్వర్ణాలు సాధించారు. భారత షూటర్లు మరో నాలుగు బంగారు పతకాలు గెలిచారు. 50 మీటర్ల పీస్టల్‌లో ఓమ్‌ప్రకాష్‌ 679.2 పాయింట్లతో ఈ గేమ్స్‌లో నాలుగో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐతే బాస్కెల్‌బాల్‌ ఫైనల్లో భారత్‌పై ఆఫ్ఘనిస్థాన్‌ నెగ్గి తొలిస్వర్ణాన్ని గెలుపొందింది. బాక్సింగ్‌లో నాలుగు విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై