|
|
హెచ్‌ఎంటీ పునరుద్ధరణకు ప్యాకేజీ
ముంబయి: ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఎంటీ వాచెస్ ప్రభుత్వం నుంచి పునరుద్ధరణ ప్యాకేజీని పొందనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్లాంట్ అప్‌గ్రేడేషన్‌కు, మార్కెటింగ్ వ్యూహాలకు ఈ నిధులను ఉపయోగించవచ్చని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్యాకేజీ రూ. 750 కోట్ల మేరకు ఉండవచ్చునని భావిస్తున్నారు.
|
|
|