|
|
ఇండోర్‌లో ఆడుకునే అవకాశం
కడప: ఈ నెల 10వ తేదీ నుంచి కడప ఇండోర్‌స్టేడియంలో క్రీడాకారులు ఆడుకునే అవకాశం కల్పిస్తామని ఇండోర్‌స్టేడియం కమిటీ కన్వీనర్, ఈవో మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. క్రీడాకారుల కోసం కమిటీ ప్రవేశ రుసుమును నిర్ణయించిందన్నారు. క్రీడాకారులు శాశ్వత సభ్యత్వం కోసం రూ. 25వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. వీరు నెలసరి ఫీజులను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ సభ్యత్వానికి రుసుం చెల్లించి నెలసరి ఫీజులు రూ. 500చెల్లించాలన్నారు. విద్యార్థులు రూ. 1000 డిపాజిట్, ప్రతీనెల రూ. 300చెల్లించాలన్నారు. క్రీడారత్నాలుగా ఎన్నుకున్నవారు ఎలాంటి రుసుం చెల్లించనక్కరలేదన్నారు. సభ్యత్వం కావలనుకున్నవారు తననుగానీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారినిగానీ కలవాలని చెప్పారు.
|
|
|