|
|
యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ
హిమాలయ హెర్బల్ హెల్త్‌కేర్ సంస్థ నూతనంగా యాంటీ హెయర్ ఫాల్ షాంపూను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది శిరోజాలను పటిష్ఠం చేసి అవి రాలకుండా చూస్తుందని సంస్థ పేర్కొంది. రోజుకు సుమారుగా 70 వెంట్రుకల వరకూ రాలిపోవడం సహజమే. అంతకు మించితే మాత్రం నివారణ చర్యలు తీసుకోకతప్పదు. మానసిక ఒత్తిళ్ళు, కాలుష్యం, పోషకాహార లోపం, హా ర్మోన్ల అసమతుల్యత, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. నేటి బిజీ లైఫ్‌స్టయిల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ షాంపూను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈషాంపూ కుదుళ్ళను గట్టిపర్చి రాలిపోకుండా చూస్తుందని పేర్కొంది. 100 మి.లీ షాంపూ ధర రూ. 63., 200 మి.లీ. బాటిల్ ధర రూ. 120.
|
|
|