|
|
ఫుడ్‌ప్రాసెసింగ్‌కు పన్ను రాయితీలు
త్వరలో బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పన్ను రాయితీలివ్వాలని ఫిక్కీ డిమాండ్ చేసింది. ఈ రంగంలో ఏటా రూ. 30 వేల కోట్ల మేరకు వృథా చోటు చేసుకుంటున్నదని, దీన్ని తగ్గించేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరింది. రిఫ్రిజరేషన్ మెషినరీ భాగాలపై, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్‌లపై ఎకై్సజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించాలని అభ్యర్థించింది. ఈ రంగానికి సంబంధించి 16 సూత్రాల అజెండాను ఫిక్కీ ప్రభుత్వానికి సమర్పించింది. కోల్డ్ చెయిన్ ప్రాజెక్ట్‌లకు కాస్ట్ సబ్సిడీలను పొడిగించాలని కోరింది. వ్యవసాయంలో భౌతిక మౌలికవసతులపై ప్రైవేటు రంగం పెట్టే పెట్టుబడులకు, మొత్తం అగ్రి-వాల్యూ చెయిన్‌పై పదేళ్ళ పాటు నూటికి నూరు శాతం టాక్స్ హాలీడే ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్ట్ వ్యవసాయం, కోత అనంతర యాజమాన్య విధానాలు, నిల్వ, కోల్డ్ చెయిన్ వృద్ధి, సాంకేతికత, మౌలికవసతుల వృద్ధి తదితరాల్లో కార్పొరెట్ల ప్రవేశాన్ని సులభతరం చేయాలని సూచించింది.
|
|
|