ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ఆక్రమిత భూములపై ప్రత్యేక దృష్టి

నెల్లూరు: ఏప్రిల్‌ 14అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా పంపిణి చేయాల్సిన భూముల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా జిల్లా యంత్రాంగం భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూముల మీద దృష్టి సారించింది. అయితే ఈప్రక్రియ పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉండడంతో అధికారులకు కత్తీమీద సాములా తయారైంది. ఈ ఏడాది అంబేద్కర్‌ జయంతిన 15వేల ఎకరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నియమించింది. 2005లో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 42వేల ఎకరాలను భూస్వాముల నుండి స్వాధీనం చేసుకోని బలహీనవర్గాలకు పంపిణీ చేసారు. భూస్వాముల నుండి భూములను స్వాధీనం చేసుకోవడంలో అడుగడుగునా రాజకీయ ఒత్తిళ్ళను అధికారులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గతంలో భూస్వాముల నుండి భూములు స్వాధీనం చేసుకున్న ఫలితంగా అనేకమంది జాయింట్‌ కలెక్టర్లు రాజకీయ బదిలీలకు గురి కాగా నేడు జెసి సౌరభ్‌గౌర్‌ ఈప్రక్రియను చేపట్టిరు. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా నియమితులైన సౌరభ్‌గౌర్‌ ముక్కుసూటిగా వ్యవహారించే మనిషి. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరగిన సందర్భంగా నెల్లూరు నగరంలోని నిత్యావసర వస్తువుల ధరల గోడౌన్లను తనిఖీకి వెళ్ళిన సందర్భంలో ఆయన రాజకీయ నాయకుల వల్ల చేదుఅనుభవనాలను ఎదురుచూసారు. ఈ నేపథ్యంలో భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రక్రియను ప్రారంభించారు. గతంలో ఎస్పీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కానీ కొనడం కానీ అమ్మడం కానీ నేరం అవుతుంది. ఒకవేళ ఎస్సీలు భూములు అమ్మినప్పటికీ వాటిని కొన్నవారి మీదే ఎక్కువగా నేరం ఆక్షేపితం అవుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌ రాజశేఖర్‌ మొదటి విడత భూముల పంపిణి సందర్భంగా 26వేల ఎకరాల భూములను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని పేదలకు పంచారు. రాష్ట్రంలోనే ఇది రికార్డు. అయితే అసలు కథ తరువాతే ప్రారంభం అయింది. కలెక్టర్‌ రాజశేఖర్‌ను నెలతిరగకుండానే అప్పటి వై.ఎస్‌.ఆర్‌. మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను ప్రాధాన్యం లేని పోస్టుకు తరలించడంలో ఇక్కడి రాజకీయ నాయకులు పెద్దపాత్రే పోషించారు. అటు తరువాత వచ్చిన రవిచంద్ర, పరిస్థితులకు రాజీపడిపోయి భూముల స్వాధీనంలో మెతకవైఖరిని అవలంభించారు. ఫలితంగా 2006,2007,2008 ప్రాంతంలో కేవలం 5,6వేల ఎకరాలను మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దశాబ్దాల తరబడి అసైన్డ్‌ భూములన్నీ ఆయా గ్రామాల్లో పెత్తందార్ల చేతుల్లో ఉన్నందున వారు వాటిమీద లక్షలకు లక్షలుగా పెట్టుబడులు పెట్టి పనికిరాని భూములను పంటపోలాలుగా మార్చారు. తీరా భూముల్లో బంగారం పండే సమయంలో తమ వద్దనుంచి భూములను లాక్కొవడం ఏమేరకు న్యాయం అని గతంలో కోర్టును కూడా ఆశ్రయించినప్పటికీ వారికి వ్యతిరేకంగానే కోర్టు తీర్పు వెలువడింది. జిల్లాకు చెందిన 50మంది రైతుల మీద క్రిమినల్‌ కేసులను కూడా నమోదు చేయాలని హైకోర్టు 2005లో సంచలన తీర్పునిచ్చింది. ఈ పరిస్థితుల్లో సౌరభ్‌గౌర్‌ భూముల ప్రక్రియను ప్రారంభించారు. ఏమేరకు అన్యాక్రాంతం భూములను స్వాధీనం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర