|
|
జీఆర్‌టీ కొత్త షోరూం
చెన్నై: జిఆర్‌టి అంటేనే బంగారు ఆభరణాలకు మారు పేరుగా ఉన్న సంస్థ. ఈ సంస్థ చెన్నైలో తమ షోరూంను పురుషవాక్కంలో కూడా ప్రారంభించింది. రెండతస్తుల ఈ భవనంలో బంగారు, వెండి, రత్నాలు, వజ్రాలు అన్నీ తమ షోరూంలో లభిస్తాయని సంస్థ నిర్వాహ కులు రాజేంద్రన్, జిఆర్ అనంత పద్మనాభన్, జిఆర్ రాధాకృష్ణన్‌లు తెలిపారు. వీటితో పాటు ఆధునిక మహిళల కోసం డిజైనర్ ఆభరణాలను కూడా విక్రయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ షోరూంలో పురాతన ఆభరణాల డిజైన్లు వినియోగదారులకు అందుబాటులో వుంటాయని, 1965 నుంచి నగల వ్యాపార విభాగంలో వున్న తమ వద్ద 916 స్థాయి స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. కొత్త జిఆర్‌టి షోరూం చిరునామా నెంబరు 226, పురుషవాక్కం హైరోడ్డు, అభిరామి మెగామాల్ సమీపంలో ఏర్పాటు చేసారు.
|
|
|