|
|
కాఫీరైతుల గడపలకు అందని నిధులు
విశాఖపట్నం: జి.మాడుగుల మండలంలో కాఫీ బోర్డు నిధులు ద్వారా కాఫీ పండ్లను అరబెట్టడానికి గడపల నిర్మాణాలు చేపట్టిన గిరిరైతులకు డబ్బులు అందలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మండలంలో 89 మంది కాఫీ మొక్కలు పెంచుతున్న లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాఫీ పండ్లను అరబెట్టుకోవడానికి గడపల నిర్మాణాలకు కొలతలు నియమావళి రూపొందించారు. ఒక్కొక్క గడప నిర్మాణానికి పదివేలు రూపాయలు చెల్లిస్తామని అధికారులు రైతులకు తెలిపారు. దీంతో రైతులు అప్పులు చేసి గడపలు నిర్మించుకున్నారు. గతంలో ఈ పనులు జరిగాయా లేదా అని అధికారులు ఆయా గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి గిరిరైతులు బ్యాంక్‌లో ఎకౌంట్ నెంబరు ఉండాలని తెలిపారు. దీంతో రైతులు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఇప్పటికైనా కాఫీబోర్డు అధికారులు స్పందించి గిరిజనులకు డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
|
|
|