|
|
విశాఖలో భారీగా భవనాల నిర్మాణం
విశాఖపట్నం: విశాఖలో జీవీఎంసీ అనుమతితో ప్రతి ఏడాది 350 వరకు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు గ్రూపుహౌస్‌లు, వాణిజ్య భవనాలు నిర్మితమవుతుంటాయి. ఆర్థిక మాంద్యం, స్థిరాస్తి రంగం కుదేలు కావడం వంటి కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గినా ఇప్పటికీ నిర్మాణాలైతే అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. మూడు అంతస్తులకంటే ఎక్కువ ఎత్తున నిర్మించే భవనాలకు సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగా పత్రాలను సమర్పించడం వరకు భవన నిర్మాణదారులు ప్రయత్నిస్తున్నా వాస్తవమైన పర్యవేక్షణ మాత్రం ఉండడం లేదు. లైసెన్సు పొందిన సర్వేయర్లుగానీ, కట్టడాల ఇంజనీర్లుగానీ ఆయా భవనాల ప్లాన్లు రూపొందింది. వాటి ఆమోదానికి సహకరించడమే కాకుండా జీవీఎంసీ తరపున వాటిని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని వారికి లైసెన్సులు ఇచ్చినప్పుడే దానిలో స్పష్టంగా పేర్కొంటారు. ఏమాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, ప్రమాణాలను పాటించకపోయినా ఆ విషయాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనా ఉంది. జీవీఎంసీ సొంతంగానూ దీనిని చేయాల్సి ఉంది. అయితే జరుగుతున్నదేమిటో బహిరంగ రహస్యం ఇలాంటి పరిస్థితుల్లో 1998 నుంచి ఇప్పటి వరకు నగరంలో అయిదారు ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
|
|
|