|
|
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు
హైదరాబాద్: ‘ఇది నాకో తీపి జ్ఞాపకం. ఈ కోర్సు నైపుణ్యాలను పెంచేది. ఇప్పటికే నాకు కొన్ని జాబ్ ఆఫర్లు వచ్చాయి‘ అని కంచర్ల కావ్య అన్నారు. బాయర్ - ఆర్‌జేవీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మ్ అసిస్టెన్స్ కోర్సు ఉత్తీర్ణుల్లో ఆమె ఒకరు. తరగతిలో ఆమె మొదటిస్థానం కూడా సాధించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామం. ఇక్కడ జరిగిన బాయర్ - ఆర్‌జేవీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రెండో స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు.
స్నాతకోత్సవం సందర్భంగా స్కూల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.ఎన్ రావు మాట్లాడుతూ, ‘బాయర్ - ఆర్‌జేవీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు చెందిన 17 మంది విద్యార్థులు ఒక ఏడాది ఫార్మ్ అసిస్టెన్స్ కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ఈ కోర్సు వ్యవసాయరంగంలో వారికెన్నో కెరీర్ అవకాశాలను కల్పిస్తుంది. విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా ఉండేందుకు, ఈ ఏడాది నుంచి ఈ కోర్సును ఆరునెలల ఇంటెన్సివ్ కోర్సుగా మార్చాలని నిర్ణయించాం. స్కూల్‌లో త్వరగా కోర్సు ముగించుకొని, కెరీర్ అవకాశాలను అన్వేషించేందుకు విద్యార్థులకు ఇది తోడ్పడుతుంది‘ అని అన్నారు.
స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రవికుమార్, డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ సి.వి. రావు, బాయర్ - ఆర్‌జేవీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ బోర్డ్ సభ్యులు కొంతమంది ఈ సందర్భంగా ప్రసంగించారు. కార్పొరెట్ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా, శాస్త్ర, సాంకేతిక విద్య అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా బాయర్ క్రాప్‌సైన్స్ చేపట్టిన లెర్నింగ్ ఫర్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా బాయర్ - రామానాయుడు విజ్ఞానజ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రూపుదిద్దుకుంది. చైల్డ్ కేర్ ప్రోగ్రామ్ (బాల సంరక్షణ కార్యక్రమం) కింద ఈ స్కూల్ ఏర్పాటైంది. పత్తి పొలాల నుంచి బాలకార్మికులను దూరం చేసి వారిని పాఠశాలకు పంపించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం చైల్డ్ కేర్ ప్రోగ్రామ్. ఈ తరహా సామాజిక కార్యక్రమం దేశంలో ఇదే తొలిసారి.
‘శరవేగంగా రూపురేఖలు మార్చుకుంటున్న నేటి వ్యవసాయ పరిస్థితుల్లో ఈ ఫామ్ అసిస్టెంట్‌షిప్ కోర్సు ఎంతో సందర్భోచితం. శిక్షణ పొందిన వారి అవసరం అట్టడుగు స్థాయిలో ఎంతగానో ఉంది. బాయర్ - ఆర్‌జేవీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు ఇందుకు చక్కగా సరిపోతారు. అణగారిన వర్గాలకు చెందిన యువత జీవనోపాధి నైపుణ్యాలను పొందేందుకు ఈ కోర్సు దోహదపడుతుంది. వివిధ కెరీర్ అవకాశాలను పొందడంలో వారికి సాధికారికత కల్పిస్తుంది‘ అని బాయర్ క్రాప్‌సైన్స్ దక్షిణాసియా హెడ్, కంట్రీ హెడ్ ఇండియా జెన్స్ హార్ట్‌మాన్ తన సందేశంలో పేర్కొన్నారు.
2008 మొదటి త్రైమాసికంలో ఈ స్కూల్ తన కార్యకలాపాలను ఆరంభించింది. 2009లో 27 మంది విద్యార్థులు ఇక్కడ విజయవంతంగా త మ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఈ ఫామ్ అసిస్టెంట్‌షిప్ కోర్సును విద్యార్థులకు ఉచితంగా అందించడంతో పాటు కోర్సు పూర్తి చేసిన తరువాత ఉద్యోగావకాశాలు పొందడంలో కూడా స్కూల్ వారికి సహకరిస్తోంది. ఈ ఏడాది ఈ కోర్సు పూర్తి చేసిన 17 మందిలో 12 మంది ఇప్పటికే బాయర్ క్రాప్‌సైన్స్ అనుబంధ సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాయర్ బయోసైన్స్‌లో ఉద్యోగాలు పొందారు. మిగిలిన వారు కూడా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఇప్పటి వరకూ, ఈ స్కూల్ వ్యవసాయంపై ఒక ఏడాది పూర్తికాల రెసిడెన్షియల్ వృత్తిశిక్షణ కార్యక్రమాన్ని అందించింది. కోర్సు శిక్షణాంశాలను మూడు త్రైమాసికాల్లో బోధించారు.
విత్తనోత్పత్తిలో ప్రాథమికాంశాలు, సమగ్ర సస్యరక్షణ సూత్రాలు లాంటివి ఇందులో ఉన్నాయి. మొక్కల వ్యాధులు, వాటిని ఎదుర్కొనే విధానాలు కూడా బోధించారు. వ్యవసాయ మార్కెటింగ్ లాంటి అంశాలతో కూడిన వ్యాపార నిర్వహణ, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్ లాంటి అంశాలు ఓ శిక్షణాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడివన్నీ ఆరు నెలల ఇంటెన్సివ్ కోర్సులో భాగం కానున్నాయి. ప్రముఖ విద్యావేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్తవ్రేత్తలు స్కూల్ ఫ్యాకల్టీలో భాగంగా ఉన్నారు. బాయర్ క్రాప్‌సైన్స్ లిమిటెడ్‌కు చెందిన మేనేజర్లు అతిథి ఉపన్యాసకులుగా హాజరయ్యే వారు.
ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, హైటెక్ ఉపకరణాల రంగాల్లో ప్రపంచ అగ్రగామి బాయర్. బాయర్ క్రాప్‌సైన్స్ ఏజీ అనేది బాయర్ ఏజీ అనుబంధ సంస్థ. అంతేగాకుండా క్రాప్‌సైన్స్ కంపెనీల్లో ప్రపంచ అగ్రగామి. సస్యరక్షణ, వ్యవసాయేతర క్రిమికీటక నియంత్రణ, విత్తన, మొక్కల బయోటెక్నాలజీ రంగాల్లో ఇది కృషి చేస్తోంది. జర్మనీ లోని మాన్‌హిమ్ కేంద్రంగా ఉన్న బాయర్ క్రాప్‌సైన్స్ 120కిపైగా దేశాల్లో ఉనిితో 18,000కు పైగా సిబ్బందిని కలిగిఉంది.
|
|
|