|
|
అంతా అబద్దం
పరుగు చిత్రంలో తండ్రి చాలు తనయగా అమాయకత్వం నిండిన పాత్రలో నటించి మెప్పించింది అందాల భామ షీలా. త్వరలో విడుదలకాబోతున్న 'బిందాస్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే తనను తెలుగు హీరోయిన్‌గానే ముద్ర వేయడం పట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. షీలా. తాను బాలనటిగా తమిళంలో నటించానని, హీరోయిన్‌గా కూడా తమిళ చిత్రాల ద్వారానే పరిచయమయ్యానని, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తమిళ అవకాశాలను నిరాకరిస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని షీలా అన్నారు. పరిశ్రమలో పోటీని తట్టుకోవడానికి గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కథానుగుణంగానే కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రల్లో నటించాల్సి వస్తోందని షీలా తెలిపారు.
|
|
|