ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
హోండా ఫౌండేషన్‌ అవార్డులు

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ ఇండియా ప్రై.లి. మూడవ యంగ్‌ ఇంజినీర్స్‌ అండ్‌ సైంటిస్ట్‌‌స (ఎస్‌) అవార్డులను పదిహేను మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రకటించింది. దేశానికి చెందిన వివిధ ఐఐటీలకు చెందిన విద్యార్థులు ఈ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. యువ భారతీయ ఇంజినీర్లు, శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను హోండా ఫౌండేషన్‌ ఇస్తోంది. ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌ స్వామినాథన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డులు పొందిన వారు జపాన్‌లో ఉన్నత విద్యాభ్యాసం, శిక్షణ అవకాశాలు పొందేందుకు ఆర్థిక సహాయాన్ని ఈ ఫౌండేషన్‌ అందిస్తుంది. ఈ పదిహేను మంది విద్యార్థులకు 3 వేల డాలర్ల నగదు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. అవా ర్డు వచ్చిన మూడేళ్ళ లోపు గనుక ఈ విద్యార్థులు జపాన్‌లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో చేరితే వారికి 10వేల డాలర్ల మేరకు ఉపకారవేతనం లభిస్తుంది.

హోండా చిన్న కార్ల హబ్‌గా థాయిలాండ్‌
చిన్న కార్ల ఉత్పత్తికి థాయిలాండ్‌ కేంద్రం కానున్నట్లు జపనీయుల కార్ల ఉత్పత్తి సంస్థ హోండా వెల్లడించింది. ఇక్కడ భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా కార్లను డిజైన్‌ చేస్తున్నట్లు కంపెనీ ఉన్నత అధికారులు తెలిపారు. హోండా కంపెనీకి భారతలో అనుబంధ సంస్థ అయిన హోండా సియెల్‌ కార్స్‌ ఇండియా, భారత్‌లోకి 2011లో చిన్న కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌ చిన్న కార్ల ఎగుమతులకు కేంద్రంగా మారడం లేదు. అయితే భారత్‌ విపణికి అనువైన చిన్న కార్లను తయారు చేస్తున్నాం’అని హోండా సియెల్‌ కార్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ జ్ఞానేశ్వర్‌ సేన్‌ చెప్పారు. దేశంలోని నోయిడా, తపుకరా(రాజస్థాన్‌) వద్ద గల ప్లాంట్‌లు భారతీయ విపణికి కావాల్సిన కార్లను ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన అన్నారు. ‘ఈ ప్లాంట్‌లో ఉత్పత్తయిన కార్లు కొన్ని ఎగుమతవుతున్నాయి. ప్రధానంగా పక్క దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు మా కొత్త మోడళ్లను ఎగుమతి చేస్తున్నాం’అని సేన్‌ వెల్లడించారు.


 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి