|
|
తెలుగులో 'దునియా'
గతంలో 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, 'జంబలకడి పంబ, టాప్ హీరో, దేవుడు' చిత్రాలను నిర్మించిన ఆచంట గోపీనాథ్ కన్నడలో విజయం సాధించిన 'దునియా చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో శ్రీ విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ హీరోగా కన్నడలో రూపొంది 'దునియా చిత్రాన్ని డా.దాసరి నారాయణరావు సహాయ సహకారాలతో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ఆచంట గోపీనాథ్ చెప్పారు. 'దునియా' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
|
|
|