|
|
విజయానికి క్రీడాకారులు శ్రమించాలి: గంగాధర్
నిజామాబాద్: క్రీడాకారులు తమ విజయానికి నిరంతరం శ్రమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జి.గంగాధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో తెలంగాణస్థాయి బాస్కెట్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని ఓడినవారు నిరుత్సాహ పడకుండా మరింతగా కష్టపడి తమ విజయానికి బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో క్రీడల నిర్వహణ కష్టతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తరువాత నిజామాబాద్‌లో తెలంగాణస్థాయి క్రీడలను నిర్వహించడంపట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఓలంపిక్‌సంఘం అధ్యక్షులు బాగారెడ్డి, బాస్కెట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
|