|
|
మాయాబజార్‌కు బ్రహ్మరథం
నాగిరెడ్డి, చక్రపాణి చేసిన ‘మాయాబజార్’ అనే కళాఖండం రంగుల్లో రూపుదిద్దుకుని ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది. గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ రంగులద్దిన ఈ నయా ‘మాయాబజార్’ జనవరి 30న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలై ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సూపర్‌గుడ్ రికార్డింగ్ థియేటర్లో విజయోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వాకాడ అప్పారావు మాట్లాడుతూ ‘‘మేము ఊహించిన దానికంటె మించి సినిమా విజయం సాధించింది. ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అన్నారు. కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ ‘‘వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు.
గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇది జగన్మోహన్‌గారి ఆలోచన లోంచి పుట్టింది. మేము పడ్డ కష్టానికి మించి ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా వుంది. ఈ ఉత్సా హంతో విజయావారి మరికొన్ని చిత్రాలకు రంగులద్ది తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం’’ అన్నారు.
|
|
|