|
|
సాగునీరు లేక ఎండుతున్న పంటలు
మహబూబ్‌నగర్: ఆర్టీఎస్ ఆయకట్టు పొలాలకు సాగునీరు అందకపోవడంతో వేరుశనగ, సద్ధలు, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పంటలు వేస్తున్నామని తక్కశిల రైతులు కె.రాముడు, భాస్కర్, జయరాముడు తదితరులు తెలిపారు. పంటలకు నీళ్లు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఆర్టీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు రెండు రోజుల్లో అందించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామని డిఇ మధుకర్‌రెడ్డి తెలిపారు.
|
|
|