ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
అయ్యా మేం బతికే ఉన్నాం!

సంగెం: 'అయ్యా మేం బతికే ఉన్నాం. చనిపోలేదు. అధికారులు మాత్రం మమ్మల్ని రికార్డుల్లో చంపేశారు. పింఛన్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ, మేం బతికే ఉన్నట్లు గుర్తించండి. మేం నిజంగా మనుషులమే. దెయ్యాలం కాదు.' అంటూ నల్లా శ్రీనివాస్‌, గొటుకుల బాలయ్య అనే పింఛన్‌దారులు ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ ఈఓపీఆర్‌డీకి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వంజరపల్లి గ్రామానికి చెందిన నల్లా శ్రీనివాస్‌ వికలాంగుడు.

అదే గ్రామానికి చెందిన గొటుకుల బాలయ్య 70 ఏళ్ల వృద్ధుడు. వీరిద్దరికీ ప్రభుత్వ పింఛన్లు అందుతున్నాయి. అయితే ఇటీవల చేపట్టిన సామాజిక తనిఖీలో భాగంగా వీరి ఇంటికి వెళ్లి కార్డులు పరిశీలించిన అధికారులు వీరిద్దరూ మరణించి నట్లు నివేదిక పంపారు. గత జనవరి వరకు పింఛన్లు తీసుకున్న వీరు ఈ నెల పింఛన్‌ తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఇంటింటి సర్వేలో మరణించినట్లు రికార్డులో ఉన్నదున పింఛన్‌ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న వారిద్దరూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి మేం బతికి ఉన్నట్లు ధ్రువీకరించాలని ఇన్‌చార్జ్‌ ఈఓపీఆర్‌డీ లకీనర్సింహరావును వేడుకున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర