|
|
సైకిల్‌పోలో పోటీలు ప్రారంభం
కర్నూలు: స్థానిక బి క్యాంపు ప్లేగ్రౌండ్‌లో జిల్లాస్థాయి సైకిల్‌పోలో ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను సైకిల్‌పోల్ సంఘం సలహాదారు ఎస్.మునిరహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిరహ్మద్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 14తేదీవరకు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సైకిల్‌పోలో సంఘం జాయింట్ సెక్రటరీ ఎంఎండి బాష, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
|
|
|