|
|
కారు ఎడ్ల బండి ఢీ.. రెండు ఎడ్లు, ఒకరు మృతి
సంగారెడ్డి: తాగిన మైకంలో కారును అతి వేగంగా నడిపిస్తూ చెరుకు రవాణా చేస్తున్న ఎడ్ల బండికి ఢీ కొనడంతో కారు డ్రైవర్, బండిని లాక్కెళ్తున్న రెండు ఎడ్లు మృతి చెందాయి. మెదక్ డీఎస్పీ డొలిమొగలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పుల్‌కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంగారెడ్డికి 18కిలోమీటర్ల రహదారిపై శుక్రవారం రాత్రి 9.50గంటలకు కారు, ఎడ్ల బండిని ఢీ కొందని తెలిపారు. ఈ ప్రమాదంలో మెహదీపట్నంకు చెందిన యశ్వంత్ రెడ్డి స్పాట్‌లో చనిపోగా, అల్లాదుర్గం మండలం డోక్యా తండాకు చెందిన దానావత్ సుభాష్ ఎడ్డు రెండు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు కంటిపై భాగంలో గాయాలయ్యాయి. శవాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
|