|
|
సెజ్‌భూముల అక్రమాలపై విచారణ...
ప్రారంభించిన జిల్లా యంత్రాంగం
నెల్లూరు: ఇటీవల కృష్ణపట్నం ప్రత్యేక ఆర్థిక మండళ్ళల్లో, ప్రభుత్వం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం శనివారం నుంచి సమగ్ర విచారణ చేపట్టింది. ఈ భూముల వ్యవహారంలో గూడూరు ఆర్డీవోతో సహా ఒక ఎమ్మార్వో, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మీద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోట, తిళ్ళకూరు మండలాల్లో కూడా ప్రత్యేక ఆర్థిక మండలి భూముల్లో భారీ ఎత్తున కుంభకోణం జరిగినట్లు అప్పటి ఏసీబీ సిఐ జయచందర్‌రాజు తన నివేదికల్లో పేర్కొన్న విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఆ క్రమంలో జయచందర్‌రాజును కర్నూలు రేంజ్‌కి శాంతిభద్రతల విభాగంలో సిఐగా బదిలీ చేయగా ప్రస్తుతం ఏసీబీ సిఐ నరసింహన్ డిఎస్పీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు నెల్లూరుకు చేరుకున్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సంపత్‌కుమార్ నరసింహన్‌తో సుమారు ఏడు గంటల పాటు భూకుంభకోణాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఇవ్వాల్టి నుంచి అక్రమాలు జరిగినట్లు ఆరోపనలు ఉన్న కోట, తిళ్ళకూరు, ముత్తుకూరు మండలాల్లో పర్యటించి నేరుగా ప్రజలనే విచారిస్తారని తెలుస్తూ ఉంది.
|
|
|