|
|
సీమాంధ్ర వాసులకు రక్షణ కల్పించాలి
కడప: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు డెడ్‌లైన్ విధించడం మంచిది కాదని కడప జిల్లా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వచ్చేనెల 1వ తేదీలోగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టాలని లేకపోతే జంట నగరాలకు సీమాంధ్ర వాసులను రానీయమని తెలంగాణా ప్రాంత విద్యార్థులు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న సీమాంధ్ర విద్యార్థులను అరెస్ట్ చేయడం ధారుణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్‌కు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళినంత పనే అవుతుందని దివంగత ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వాస్తవమని నేడు అర్థమవుతుందని జేఏసీ కన్వీనర్ సిహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల అరెస్ట్ ప్రజా హక్కులను కాల రాయడమేనని చెప్పారు. తెలంగాణా వాదులు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
|
|
|