|
|
ముస్లిం మైనార్టీలంతే ప్రభుత్వానికి అలుసు
కడప: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్ర హైకోర్టు ముస్లిం రిజర్వేషన్ల కోటాను కొట్టివేసిందని టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్‌బాబు ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ముస్లింకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని చెప్పారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హడావుడిగా ప్రభుత్వం అప్పట్లో జీవోను కూడా విడుదల చేసిందన్నారు. అయితే ఈ అంశం కోర్టుకు వెళ్ళడంతో ఒక శాతానికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. దీనిపై కూడా నేడు కోర్టు పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచిత, నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆయన దుయ్యబట్టారు.
|
|
|