ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ప్రారంభం కానున్న రెండు ఎత్తిపోతల పథకాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లా మణుగూరు సబ్‌ డివిజన్‌లో రెండు భారీ ఎత్తిపోతల పథకాలు ప్రారంభం కానున్నాయని తద్వారా 2200 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందించే ఈ లిస్ట్‌ల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని పినపాక శాసన సభ్యుడు రేగా కాంతారావు తెలిపారు. 50 శాతానికి పైగా గిరిజన రైతుల ఆయకట్టు ఉండే ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎమ్మెల్యేకు లేఖ అందింది. దీంతో మొట్టమొదటిగా 1032 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసే పినపాక మండలం మోతేలిఫ్ట్‌ను, 1136 ఎకరాల ఆయకట్టుకు నీరందించే అశ్వాపురం మండలంలోని పాములపల్లి లిఫ్ట్‌ను ప్రతిపాదించారు. అధికారులతో పూర్తిస్థాయి ప్రతిపాదనలను తయారు చేయించి వరంగల్‌ ఎస్‌ఈకి పంపారు. ఈ రెండు లిఫ్ట్‌లకు కలిపి 30 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో లిఫ్ట్‌ల మంజూరుకు నిధుల కొరత లేదని ప్రభుత్వం కోరిన పద్ధతిలోనే మోతే, పాములపల్లి లిఫ్ట్‌లకు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యేల తెలిపారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం