|
|
పోస్టుల భర్తీ నిర్ణయంతో కెటిపిఎస్‌లో హర్షం
ఖమ్మం: ఎపి జన్‌కో పరిధిలో 1987 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పై పాల్వంచలోని కేటిపిఎస్‌లో హర్షం వ్యక్తమవుతోంది. కెటిపిఎస్‌లో 1220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 6వ దశ నిర్మాణం పూర్తయితే మరో 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో కెటిపిఎస్‌లోని పలు విభాగాల్లో సుమారు 33 పోస్టులు భర్తీఅయ్యే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. వీటిలో 650 ఇంజనీర్ పోస్టులు, 1337 వర్క్‌మెన్ కేడర్‌పోస్టులు భర్తీ అవుతాయని కెటిపిఎస్‌లో కార్మికులకు పనిభారం తగ్గుతుందని ఇది కాస్త ఊరట కలిగిస్తోందని నేతలు చెబుతున్నారు.
|
|
|