|
|
లెక్కలతో డొక్కలు నిండవు
ఖమ్మం: ప్రభుత్వం, అధికారులు చెప్పే కాకి లెక్కలతో పేద ప్రజల డొక్కలు నిండవని మాజీ శాసన సభ్యుడు సిపిఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఎద్దేవ చేశారు. జిల్లా పరిషత్‌లో నయాపైస జనరల్ ఫండ్ లేదని అయినప్పటికీ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు అధికారులు జిల్లా మంత్రి కాగితాలపై కాకి లెక్కలు చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రామాలలో పనులు చేపట్టడానికి ఏమీ లేవనే నెపంతో ఉపాధి పనులు ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తమ్మినేని ఆరోపించారు. అధికారులు తమతో గ్రామాల్లోకి వస్తే పనులు చూపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రమంతా కరువు, రోగాలతో అల్లాడిపోతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం కుస్తీపడుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
|
|
|