ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
త్వరితగతిన ఇర్రేడియేషన్‌ ఫ్లాంట్‌ నిర్మాణం

ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలో 15.20 కోట్లతో ప్రారంభించిన ఇర్రేడియేషన్‌ ఫ్లాంట్‌ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఫ్లాంటు, 32 దుకాణాల సముదాయాలు, ఈ గోదాముకు సంబంధించి పనులు డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దుకాణం సముదాయాలకు సంబంధించిన పనులు పునాధి స్థాయిని దాటాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఇన్‌ప్రాస్రస్టర్‌ ఎక్వీట్మెంట్‌ కార్పొరేషన్‌ చేపట్టింది. 11 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచింది. ఇదే చోట భవన నిర్మాణానికి నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 25 లక్షలను మంజూరు చేసింది. ఇర్రేడియేషన్‌ ఫ్లాంట్‌ నిర్మాణం కోసం రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిధులు మంజూరు కావడం, పనులు ప్రారంభించడంతో మరో 9 నెలల్లోనైనా నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఫ్లాంటు నిర్మాణం పూర్తయితే ఇక్కడి రైతులు మామిడిని విదేశాలకు ఎగుమతి చేయడానికి, మిర్చీ, ఉల్లి, ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తులు నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఫ్లాంటేషన్‌ ఆవరణలో ఉన్నత దుకాణ సముదాయాలలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం కూడా జరుగుతోంది. దీంతో రైతులకు ఒకింత శ్రమ తగ్గుతుంది.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం