ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
విద్యార్థులకు ఆదర్శం నవీన్‌బాబు

ఖమ్మం: ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి ఆశయంతో పాటు చదువు కావాలి. వీటన్నింటితోపాటు కళాశాలలో ఫీజులు చెల్లించి ఎంతో డబ్బు ఖర్చుపెడితే కాని చదువుకోలేరు. కానీ ఈ యువకుడు మాత్రం పేదవాడినైతేనేమీ నేను కూడా చదువుకోగలను అంటూ పేదరికం అడ్డు వస్తున్నా కూడా భవిష్యత్తుపై కొండంత ఆశతో ఖాళీ సమయాల్లో కూలీ నాలీ చేసుకుంటూ భవిష్యత్తు ఉన్నవారిదే కాదు తనలాంటి పేదవారిది కూడా అని, కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న నానుడిని గుర్తించుకుంటూ చదువులో ముందుకు సాగుతూ పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ నవీన్‌బాబు. ఖమ్మం పట్టణ శివారులో ఉన్న శారదా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌ కళాశాలలో బీటెక్‌ ట్రిబుల్‌ ఇ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్‌బాబుది నిరుపేద కుటుంబం. ఎస్సీ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. అతని తల్లి విజయ కూలి పని చేస్తూ నవీన్‌బాబుతో పాటు అతని చెల్లిని చదివిస్తోంది. తాపిమేస్త్రీగా పని చేస్తున్న తన తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో అతని బాధ్యత కూడా తల్లిపైనే పడింది. తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న నవీన్‌ చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉపాధి వెతుకుంటున్నాడు. చదువుకోవాలనే ఆశతో ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్‌, మిషన్‌, సఫ్లై బాయ్‌గా అవతారమెత్తుతూ చదువు కొనసాగిస్తున్నాడు. తన చదువుకు అయ్యే ఖర్చులో తల్లితో పాటు తాను కూడా బాధ్యతను పంచుకుంటున్నాడు. పని దొరకని సమయాన్ని వృధా చేయకుండా చదువుకుంటున్నాడు. చాలీ చాలని ఇల్లు, అనారోగ్యంతో ఉన్నతండ్రి, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువుపై ఉన్న శ్రద్ధను ఏ మాత్రం తగ్గకుండా చదువుకుంటున్నాడు. తెలిసిన దాతలు ఎవరైనా సహకరిస్తే తన భవిష్యత్తుకు పునాది వేసినవారు అవుతారని నవీన్‌బాబు అంటున్నాడు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం