|
|
20 నుంచి రాజా సినిమా రెండో షెడ్యూల్
రాజా, సంచిత పదుకొనే జంటగా శ్రీనివాస్ బళ్ళాపురం దర్శకత్వంలో జయకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సి.గోపాలకృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల 20 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. దర్శకుడు బళ్ళాపురం శ్రీనివాస్ మాట్లాడుతూ 'రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఒక ఎన్నారై యువకుని ప్రేమకథే ఈ చిత్ర కథాంశం. పరిణతి చెందిన ఈ ప్రేమ కథ ప్రేక్షకుల్లో సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. వెంగి-విఠల్ చక్కటి సంగీతాన్ని అందించారు అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.ఎస్.సాయికృష్ణ మాట్లాడుతూ 'రాజా బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా ఈ అద్భుతమైన ప్రేమ కథను రూపొందిస్తున్నాం. పాటలను విదేశాలలో చిత్రీకరిస్తాం...రెండో షెడ్యూల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. రెండో షెడ్యూల్‌లో మిగిలిన టాకీ పూర్తి చేసిన పాటలను విదేశాలలో చిత్రీకరిస్తాం అన్నారు. చలపతిరావు, ఎ.ఆర్.సి.బాబు, బాలయ్య, సుధ, సన, జెన్నీ, ఉత్తేజ్, శ్రీనివాసరెడ్డి, విజయ్, వేణు, శరత్, కిరీటి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వేటూరి, వెంగి, సంగీతం: వెంగి, విఠల్, కెమెరా: ఎం.జోషి, ఎడిటింగ్: ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్: బి.ఎస్.సాయికృష్ణ, సమర్పణ: ఎం.విజయకుమారి, నిర్మాత: సి.గోపాలకృష్ణ, కథ, మాటలు: స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ బళ్ళాపురం.
|
|
|