|
|
అమితాబ్... ఓ అద్భుతం
బిగ్ బీకి బ్రిటన్ ప్రధాని బ్రౌన్ ప్రశంస
లండన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌పై బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌన్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఉన్న అద్భుతమైన వ్యక్తుల్లో అమితాబ్ ఒకరని కొనియాడారు. ముంబయి ప్రజలకు మధుమేహ పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన సంచార వాహనం 'అమితాబ్' తాళాలను బ్రౌన్ సోమవారం రాత్రి అమితాబ్ బచ్చన్‌కు అందజేశారు. ఈ బస్సును భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ కీత్ వాజ్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ సిల్వర్ స్టార్ రూపొందించింది. కార్యక్రమంలో బ్రౌన్ మాట్లాడుతూ.. ''ఇక్కడకు వచ్చే ముందు అమితాబ్‌తో మాట్లాడాను. నా టీవీ ఇంటర్వ్యూని 40 లక్షల మంది చూస్తారు. రాబోయే మీ సినిమాను ఎంత మంది చూస్తారని అడిగితే.. '5 కోట్ల మంది' అని చెప్పారు. ఆయన గొప్పతనానికి ఇదే నిదర్శనం'' అని చెప్పారు. భారత్‌తో దృఢమైన సంబంధాలు, ఆంగ్లో ఇండియన్ల భాగస్వామ్యం లేని నవీన బ్రిటన్‌ను ఊహించలేమని చెప్పారు. అమితాబ్ మాట్లాడుతూ.. సిల్వర్ స్టార్ సేవా కార్యక్రమాలు భారతదేశం మొత్తం వ్యాపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నటులు సంజయ్‌దత్, శిల్పాశెట్టి కూడా పాల్గొన్నారు.
|
|
|