|
|
వర్దన్నపేటలో జోరుగా ఇసుక రవాణా
వర్ధన్నపేట: ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమంగా రోజుకు వందలాఇది ట్రాక్టర్లతో పట్టణాలకు తరలిపోతుంది. సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఖమ్మం-వరంగల్ రహదారి మీదుగానే జోరుగా ఇసుక రవాణా అవుతుంది. వాల్టా చట్టాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వదర్ధన్నపేట మండలంలో ఆకేరువాగును ఆనుకొని ఉన్నా నందనం, వర్ధన్నపేట, కొత్తపల్లి, పర్వతగిరి మండలంలోని నారాయణపురం, రోళ్ళకల్లు, కల్లెడ, బూర్గమల్ల గ్రామాల నుండి వందలకొలది ట్రాక్టర్లు నడుస్తుంటాయి. ఈ గ్రామాలనుండి వరంగల్, హన్మకొండ, నర్సంపేట లాంటి ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈదందా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులకు ముడుపులు ముడుతున్నందుకే పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోతుందని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా అక్రమంగా తరలిస్తున్న ఇసుకరవాణాను అరికట్టాల్సిన అవసరముందని పలుగ్రామాల ప్రజలు కోరుతున్నారు.
|
|
|