ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
నారీమతల్లి నమోస్తుతే

నెల్లూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు మహిళలకు రాజకీయాలలో 33 శాతం బిల్లును పార్లమెంటులో సోమవారం నాడు ప్రవేశపెట్టనున్న ఛారిత్రాత్మక ఘట్టం పట్ల సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సరిగ్గా 12 గంటలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లు పట్ల ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, సీపీఐ, సీపీఎంలు సుముఖత వ్యక్తం చేయడంతో దాదాపు బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తుండగా జిల్లాల్లోని మహిళల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్‌లో మహిళలను రైతులుగా తీర్చిదిద్దేందుకు, నిరుపయోగం పడి ఉన్న భూములను మహిళలకు లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ద్వారా జిల్లాల్లో మహిళలకు పెద్ద ఎత్తున రాజకీయ సాధికారత సంభవించనున్నది. ప్రస్తుతం జిల్లాల్లో 46 జడ్పీటిసిలకు గానూ 17 మంది, 46 ఎంపీటిసి అధ్యక్షులకు గానూ 20 మంది, 599 ఎంపిటిసిలకు గానూ 250 మంది, 961 పంచాయితీ సర్పంచ్‌లకు గానూ 321 మంది, 8,840 పంచాయితీ వార్డ్‌ సభ్యులకు గానూ 2,693 మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 33 శాతం రిజర్వేషన్లు అమలు అయితే వీరి సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇక మునిసిపాలిటీల విషయానికి వస్తే నెల్లూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్‌లకు గానూ 18 మంది మహిళలు, గూడూరు మునిసిపాలిటీలో 33 మందికి గానూ 11 మంది, కావలి మునిసిపాలిటీల్లో 37 మందికి గానూ 12 మంది, వెంకటగిరి మునిసిపాలిటీలో 25 మందికి గానూ 11 మంది మహిళలు ఉన్నారు. శాసన సభ ఏర్పాటైన 1955 నుంచి శాసన సభ ఎన్నికల్లో మాత్రం నెల్లూరు జిల్లాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోగా 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ వెంకటగిరి నుంచి ఎంపికైన తొలి మహిళా శాసన సభ్యురాలు కావడంతో పాటు మంత్రిగా కూడా రాజశేఖర్‌రెెడ్డి కేబినెట్‌లో 5 సంవత్సరాల పాటు పని చేశారు. ఎంపీల విషయానికి వస్తే నెల్లూరు రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి తొలుత కె.పద్మాశ్రీ అనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపి కాగా తెలుగుదేశానికి చెందిన ఉక్కాల రాజేశ్వరమ్మ ఎంపీగా ఉన్నారు. నెల్లూరు రిజర్వ్‌డ్‌ స్థానం నుంచి పనబాక లక్ష్మీ మూడు సార్లు ఎంపి కావడంతో పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె బాపట్ల పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెల్లూరుకు చెందిన దివంగత ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ ఒంగోలు ఎంపీగా ఒక్కసారి గెలుపొంది అనంతరం నెల్లూరు జిల్లాల్లోని కావలి శాసన సభా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన చూస్తే 2005 నుంచి జిల్లాల్లో మహిళలకు అటు శాసనసభలో గానీ, ఇటు లోక్‌సభలో గానీ స్థానిక సంస్థల్లో మునిసిపాలిటీల్లో గాని ప్రాతినిధ్యం పెరిగింది. మహిళా బిల్లుతో పని లేకుండా అన్ని రాజకీయ పార్టీలు గతంలో 17 శాతం రిజర్వేషన్లను అమలు చేయగా ప్రస్తుతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంచేయనుండడంతో రానున్న శాసన సభ స్థానిక సంస్థలు మునిసిపాలిటీ ఎన్నికల్లో ఇక మహిళలు తిరుగులేని అధికారాన్ని చెలాయించనున్నారు. అయితే మహిళా కోట కింద 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నప్పటికీ సహజంగా చట్టసభల్లో ప్రవేశించేవారంతా ఎక్కువ శాతం సంపన్నవర్గాలే కావడం వల్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ముస్లింలు, క్రిష్టియన్లు, బీసీలు పెద్దగా చట్టసభల్లో ప్రవేశించే అవకాశం లేకపోవడం ఇక్కడి ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్‌లో మహిళలు కూడా అక్కడక్కడ పోటీ చేస్తున్న సందర్భాలు ఉన్నప్పటికీ మొత్తం మీద చూస్తే జిల్లాల్లోని శాసన సభలు, స్థానిక సంస్థలు, పంచాయితీల్లో వారి ప్రాతినిధ్యం తక్కువనే చెప్పాలి. ఏదీ ఏమైనా సోమవారం నాడు పార్లమెంటులో మహిళల కోసం ప్రవేశపెట్టే 33 శాతం రిజర్వేషన్‌ల పట్ల అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయ పక్షాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా పులిమి శైలజారెడ్డి ఎంపిక కాగా ఆమె తర్వాత ప్రస్తుతం మేయర్‌గా నందిమండలం భానుశ్రీ, గూడూరు మునిసిపల్‌ చైర్మన్‌గా బీసీలకు చెందిన యారం మంజుల ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం అన్ని మునిసిపాలిటీల్లోనూ మహిళలు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. మొత్తం మీద మహిళలు కర్రపెత్తనం నుంచి 33 శాతం రిజర్వేషన్‌తో కత్తి పెత్తనానికి ఎదగనుండడం మహిళలపై ఇక నుంచి పురుషాధిక్యత తగ్గే అవకాశం ఉందని మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఏదీ ఏమైనా మహిళల చరిత్రలో మార్చి 8 2010 ఒక చిరస్మరనీయ ఘట్టంగా నిలిచిపోనుంది.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర