|
|
జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్ పోటీలకు లక్ష్మీ!
శ్రీకాకుళం: జాతీయ స్థాయి మహిళ ఫుట్‌బాల్ చాంఫియన్‌షిప్ పోటీలకు శ్రీకాకుళం పట్టణానికి చెందిన జి.లక్ష్మీ ఎంపిక అయింది. ఈ పోటీలు ఈనెల 21వ తేదీ వరకు మణిపూర్ రాష్ట్రం ఇంపాల్‌లో జరగనున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఫుట్‌బాల్ శిక్షకులు ఎ.జగన్మోహనరావు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఈమె ఎంపిక కావడం పట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సి.చంద్రశేఖర్, ఆర్.చంద్రశేఖర్, డిఎస్‌డిఓ ఎల్.దేవానందం తదితరులు అభినందించి హర్షం ప్రకటించారు.
|
|
|