ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
జర్నైల్‌సింగ్‌పై దాడి...

- సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్‌కుమార్‌కు బెయిలు
న్యూఢిల్లీ: గత ఏడాది ఏప్రీయల్‌లో హోంమంత్రి చిదంబరంపై బూటు విసిరి వార్తల్లోకెక్కిన జర్నౖెెల్‌సింగ్‌ అనే సిక్కు జర్నలిస్టుకు కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. బుధవారంనాడు తాను కోర్టులో నుంచి బయటికి వస్తున్న తరుణంలో సజ్జన్‌కుమార్‌ అనుచరులుగా భావిస్తున్న కొందరు తనపైబడి కొట్టారని జర్నౖెెల్‌సింగ్‌ ఆరోపించారు. వారిలో ఒకరు తనను తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారని ఆయన చెప్పారు. ఉచకోత కేసు విచారణను పరిశీలించేందుకు తాను కూడా సిబిఐ సాక్షి నీర్‌ప్రీత్‌కౌర్‌తోపాటు కోర్టుకు హాజరయ్యానని ఆయన చెప్పారు. కౌర్‌తోపాటు ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారని సజ్జన్‌ అనుచరులు బెదిరించారని ఆయన చెప్పారు. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఉచకోత కేసులో సజ్జన్‌కుమార్‌ సహా పదిమందికి నేడు కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై వీరికి ఒక్కొక్కరికి బెయిలు మంజూరు చేసింది. 1984అక్టోబర్‌ 31న ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై దాడులకు ప్రోత్సహించారన్న ఆరోపణలపై సిబిఐ సజ్జన్‌కుమార్‌ తదితరులపై రెండు కేసులను నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి సజ్జన్‌కుమార్‌కు బెయిల్‌ తిరస్కరించిన న్యాయస్థానం నేడు బెయిలు మంజూరు చేసింది.


 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం