|
|
ఏసీబీకి చిక్కిన అన్నవరం ట్రాన్స్‌కో ఏఈ
అన్నవరం: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణ రాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. సత్యనారాయణ ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఏఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
|
|
|