|
|
ఏసీబీ వలలో బుట్టాయగూడెం పీవో
ఏలూరు: బుట్టాయిగూడెం ఐటీడీఏ పీవో సదర్శన్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. బుట్టాయగూడెం, ఆచంట నివాసాల్లో సోదాలు జరుపుతోంది. కృష్టా జిల్లా గన్నవరంలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్టు సమాచారమందింది.దాడుల్లో కోటిరూపాయలకు పైగా అక్రమఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌నుంచి రూ.లక్ష నగదుతో పాటు ఆస్ట్రేలియా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.
|
|
|