ఉడాన్ విమానాల ద్వారా 184 టన్నుల వైద్య సరుకుల రవాణా

52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ లైఫ్‌లైన్ ఉడాన్ చొరవతో, మారుమూల, కొండ ప్రాంతాలతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వైద్య సరుకులను రవాణా చేయడానికి దేశవ్యాప్తంగా 132 కార్గో విమానాలు నడస్తున్నాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఎఎఫ్, ప్రైవేట్ విమానయాన సంస్థల సహకారంతో, లాక్‌డౌన్ కాలంలో 184 టన్నులకు పైగా వైద్య సామాగ్రి పంపిణీ చేసారు. ఎయిర్ ఇండియా, అలయన్స్, ఐఏఎఫ్, ఇండిగో, స్పైస్ జెట్ కలిపి ఆదివారం వరకు 132 సర్వీసుల ద్వారా 184 టన్నుల మందులు, ఇతర వైద్య సామానులను ఆయా ప్రాంతాలకు రవాణా చేశాయి. లడఖ్, కార్గిల్, దిమాపూర్, ఇంఫాల్, గౌహతి, చెన్నై, అహ్మదాబాద్, జమ్మూ, కార్గిల్, లే, శ్రీనగర్, చండీగఢ్, పోర్ట్ బ్లెయిర్ కోసం ఎయిర్ ఇండియా, ఐఎఎఫ్ కలిసి పనిచేశాయి.

ఇక, అంతర్జాతీయం సర్వీసులుగా షాంఘై ఢిల్లీ మధ్య నేరుగా వాయు మార్గం నిర్ధారణ అయింది. ఎయిర్ ఇండియా మొదటి కార్గో ఫ్లైట్ 4 ఏప్రిల్ 2020న ఆపరేట్ చేసి 21 టన్నుల వైద్య పరికరాలను తీసుకువచ్చారు. అవసరానికి అనుగుణంగా కీలకమైన వైద్య పరికరాల రవాణా కోసం ఎయిర్ ఇండియా చైనాకు ప్రత్యేకంగా షెడ్యూల్ కార్గో విమానాలను నడుపుతుంది. మరోవైపు, దేశీయ కార్గో ఆపరేటర్లు బ్లూ డార్ట్, స్పైస్‌జెట్, ఇండిగో వ్యాపార దృష్ట్యా కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్జెట్ మార్చి 24 నుండి ఏప్రిల్ 5 వరకు 174 కార్గో విమానాలను 2,35,386 కిలోమీటర్ల దూరం నడిపి 1382.94 టన్నుల సరుకును చేరవేసాయి. వీటిలో 49 అంతర్జాతీయ కార్గో విమానాలు.

బ్లూ డార్ట్ 52 దేశీయ కార్గో విమానాలను 5,00,86 కిలోమీటర్ల దూరం 760.73 టన్నుల సరుకును చేరవేయడానికి 25 మార్చి నుండి 4 ఏప్రిల్ వరకు నడిపింది. ఇండిగో 3 – 4 ఏప్రిల్ 2020 న 810 కార్గో విమానాలను 6103 కిలోమీటర్ల దూరం నడిపింది. 3.14 టన్నుల సరుకును తీసుకువెళ్ళింది.