రూ. వందకే 5 రకాల పండ్లు!

0
7 వీక్షకులు

ఏలూరు, ఏప్రిల్ 19 (న్యూస్‌టైమ్): జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల ప్రజలకు రోగ నిరోధకశక్తిని పెంపొందించే 5 రకాల పండ్లను వంద రూపాయలకే అందించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కె. వెంకటరమణారెడ్ది వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఆదివారం మార్కెటింగ్, ఉద్యానవనశాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డజను అరటిపండ్లు, కేజీ జామకాయలు, ఒక పుచ్చకాయ, ఒక బొబ్బాయి, ఆరు నిమ్మకాయలు ఒక బ్యాగ్‌లో వేసి కిట్‌గా తయారు చేసి రెడ్ జోన్ ప్రాంతాల ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించనున్నట్లు జేసీ చెప్పారు.

ఈనెల 20వ తేదీన నుండి ఫైలెట్ ప్రాజెక్టుగా ఏలూరులోని రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అవి కావలసిన వారు సంబంధిత వాలంటీర్లకు తెలియచేసినట్లయితే వారే ఇంటికి తీసుకువచ్చి అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, ఇతర రెడ్ జోన్ ప్రాంతాలలో అమలు చేయడం జరుగుతుందన్నారు. కరోన్ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయంతీసుకున్నదని చెప్పారు. వీటితో పాటు ప్రజలు తమశక్తి కొద్ది అందుబాటులో వున్న రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్ వంటివి విరివిగా ఉపయోగించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here