చిత్తూరు జిల్లాలో 7 కంటైన్‌మెంట్ జోన్లు

0
6 వీక్షకులు

చిత్తూరు, ఏప్రిల్ 12 (న్యూస్‌టైమ్): జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన 20 పాజిటివ్ కేసుల్లో ఒకరు డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. కొవిడ్-19 వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా జిల్లాలో 7 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డికి వివరించారు. ఆదివారం అమరావతి నుండి కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ కోవిడ్–19 నియంత్రణలో భాగంగా కరోనా పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ క్వారంటైన్లో ఉన్న వారికి తగు వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ వారిని ఇంటింటి సర్వేలో భాగంగా గుర్తించి వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించాలని, 7 కంటైన్మెంట్ జోన్లలో ప్రధానంగా దృష్టి సారించి శాంపిల్స్ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలని, ఆ దిశగా పని చేయాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్–19 కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే జిల్లాలో తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ మహిళా వైద్య కళాశాలను రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా, చిత్తూరు ప్రధాన ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా, రుయా ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి–2గా పరిగణించి వైద్య సేవలందించడం జరుగుతున్నదని, దీనితో పాటు అదనంగా ఇంకా ఆసుపత్రులను గుర్తించి అక్కడ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, జిల్లాలో మేజర్‌గా పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా కలదని, దీనితో పాటు 6 క్వారంటైన్ సెంటర్లు పని చేస్తున్నవని, కొత్తగా వికృతమాల హౌసింగ్ కాలనీని క్వారంటైన్ సెంటర్‌గా పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లాలో పిపిఈ కిట్లు, మాస్కులు ఇప్పటి వరకు అవసరం మేరకు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 78,000 క్లాత్ మాస్కులు, 5,87,500 త్రీ లేయర్స్ మాస్కులు, 7,436 పిపిఈ కిట్లు, 2,450 గ్లౌజ్ లు, 16,115 శానిటైజర్లు, 475 గాగల్స్ పంపిణీ చేయడం జరిగిందని, తెలిపారు. 2 ట్రూ నాట్ మెషిన్ల ద్వారా వెటర్నరీ యూనివర్సిటీలో సేవలందిస్తున్నాయని, కరోనా పాజిటివ్ కేసులకు వైద్య చికిత్సలు అందించే డాక్టర్లు రోస్టర్ బేసిస్‌లో పని చేస్తున్నారని, వీరు 7 రోజులు పని చేసిన అనంతరం 14 క్వారంటైన్ కి తరలించడం జరుగుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here