ఏపీఆర్‌సెట్‌కు 80.39 శాతం హాజరు

73
ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు
  • ఏయూ సారధ్యంలో ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

  • 13న ప్రాధమిక కీ విడుదల… 15 వరకు అభ్యంతరాల స్వీకరణ

విశాఖపట్నం, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో పరిశోధనల కోసం నిర్వహిస్తున్న ఏపీఆర్‌సెట్‌ 2019కు 80.39 శాతం హాజరు నమోదయినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను నిర్వహించామన్నారు. మెత్తం 16885 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా వీరిలో 13574 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయన్నారు.

పరీక్షల ప్రాధమిక కీని ఈ నెల 13వ తేదీన విడుదల చేస్తామని, 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలు, సూచనలు తగిన ఆధారాలను జతచేసి తమకు పంపాలని కోరారు. అభ్యంతరాలు, సూచనలను కేవలం aprcetobjections2019@gmail.com ఈమెయిల్‌ ద్వారా పంపాలని తెలిపారు. నిర్ణీత కాలం తరువాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోవడం జరగదన్నారు. పూర్తి సమాచారం కోసం 0891 2730148 నంబరుకు, ఏపీఆర్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని సూచించారు.