పదవీ విరమణ చేసిన పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

135
పీవీ రమణను సత్కరించి పోలీసుల తరపున కానుక అందజేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్

ఏలూరు, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో శనివారం ఉద్యోగ పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) అధికారి పీవీ రమణను జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఘనంగా సత్కరించారు. ఏలూరులోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి రమణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన అధికారులకు రావలిసిన నగదు, ఇతర లాంఛనాలను సకాలంలో వచ్చేలా చేయడంతో పాటు రిటైర్డ్ అధికారులకు అన్ని విధాలుగా శాఖాపరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో వందల వృత్తులు ఉన్నాయని, అయితే అన్నిటికన్నా ముందుండి ప్రజాసేవ చేయడంలో ప్రజలకు దగ్గరగా ఉండేది మాత్రం ఓక పోలీస్ ఉద్యోగమేనన్నారు.

పీవీ రమణను పూలమాలతో సత్కరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్

కనిపెంచిన తల్లిదండ్రులు 20-25 ఏళ్లు మాత్రమే తమ ఒడిలో పెట్టుకొని పెంచి పోషించారని, పోలీస్ ఉద్యోగానికి వచ్చిన తరువాత పోలీస్ డిపార్టుమెంట్ సుమారు 30-35 సంవత్సరాలు గౌరవ ప్రదంగా, మర్యాద పూర్వంగా తన ఒడిలో పెట్టుకొని ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చిందని, ఇలాంటి సందర్బంలో పదవీ విరమణ పొందడం ప్రతి ఒక్కరికీ కొంచం బాధగానే ఉంటుందని, జీవితంలో ఉద్యోగం అన్న తరువాత పదవీ విరమణ పొందడం కూడా ఉంటుందని, ఉద్యోగంలో మొదటి రోజు ఎలా సంతోషంగా బిజీగా ఉంటామో చివరి రోజునా కూడా అంతే బిజీగా, కొంచెం బాధగా ఉంటుందని, 24 గంటలు, 365 రోజులు సెలవులు ఉన్నా తీసుకోలేని పరిస్థితిలో కూడా డ్యూటీ విషయంలో బంధాలకు, అనుబంధాలకు దూరమై ఎన్నో బాధలు, బాధ్యతలు ఉన్నా అన్నిటిని మరిచిపోయి సుమారు -35 సంవత్సరాలు పోలీస్ ఉద్యోగాన్ని ప్రతి క్షణం ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పోలీస్ వ్యవస్థకు మంచి సేవలు అందించిన వారికి డిపార్టుమెంటు తప్పకుండా రుణపడి వుంటుందని, పదవీ విరమణ పొందిన తరువాత అయినా బంధాలు, అనుబంధాలకు దగ్గరై తమ కుటుంబ సభ్యులతో మిగిలిన శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారని ఆశిస్తున్నానన్నారు.

కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్‌పి మహేష్ కుమార్, యస్‌బీ డీఎస్‌పీ కె.శ్రీనివాసా చారి, పోలీసు వెల్ఫేర్ నోడెల్ ఆఫీసర్, ఏ.ఆర్, డి‌ఎస్‌పి కృష్ణంరాజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం సిబ్బంది, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్.నాగేశ్వరరావు, పోలీసు అధికారులు సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఏ.ఆర్ హెచ్‌.సి. శానము రమేష్, ఏ.ఆర్. హెచ్‌.సి ఏం.వి.రావు (శెట్టి), ఊమెన్ హెచ్‌సి రత్నకుమారి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగస్తుల కుటంబ సభ్యులు వారి బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.