హైదరాబాద్, నవంబర్ 15 (న్యూస్‌టైమ్): ‘‘సౌర విద్యుత్ శక్తి రాబోయే తరాలకు వరంగా మారనున్నది. సూర్యుడు ఉన్నంతవరకు సౌరశక్తి అనేది ఉత్పన్నమవుతుంది. సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాలు సోలార్ పలకల మీద పడి విద్యుత్తు అనేది ఉద్భవిస్తుంది. విద్యుత్ అనేది పలురకాల ఉత్పత్తి అవుతుంది. హైడ్రో పవర్ ద్వారా, థర్మల్ పవర్ ద్వారా, న్యూక్లియర్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.’’ అని తెలుగు రాష్ట్రాలకు చెందిన అద్వయ ఎనర్జీ సొల్యూషన్ టెక్నికల్ డైరెక్టర్ కల్లూరు రమేష్ పేర్కొన్నారు.

‘‘పై వాటి ద్వారా విద్యుత్ సరఫరా కంటిన్యుటీ ఉండదు. అదే సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సూర్యుడు ఉన్నంతకాలం… 365 రోజులు… విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం 100% ఉంది. కాబట్టి సౌరశక్తిని ప్రతి ఇంటికి, ప్రతి పంపు సెట్టుకి, ప్రతి కారుకు, పరిశ్రమలకు, ఆఫీస్‌లకు, బ్యాంకులకు, సౌర విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవచ్చు. భారత ప్రధాని నరేంద్రమోడీ రాబోయే 2022 సంవత్సరం పూర్తయ్యే నాటికి భారతదేశంలో విద్యుత్ వినియోగదారులు 100 గిగా వాట్ల సౌరశక్తి విద్యుత్‌ను అతి తక్కువ ధరలో వినియోగించుకోవడానికి విజన్-2022 రూపొందించడం జరిగింది.’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘కేంద్ర Ministry of New Renewal Energy 1 kw నుండి 3 kw సౌర విద్యుత్ శక్తి వాడుకునే వారికి 40 % సబ్సిడీ… 4 నుండి 10 kw సౌర విద్యుత్ శక్తి వాడుకునే వారికి 30% సబ్సిడీ ఇస్తున్నారు.’’ అని తెలిపారు.

మరిన్ని వివరాలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం టీచర్ల కాలనీకి చెంది హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరనివాసం ఏర్పరచుకొని గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని అద్వయ ఎనర్జీ సొల్యూషన్‌లో టెక్నికల్ డైరెక్టర్‌గా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు జిల్లాలలో భారత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను వినియోగదారులు అతి తక్కువ ధరకు పొందేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు రమేష్. 32 వేల రూపాయలు ఒకసారి వెచ్చిస్తే 25 ఏళ్ళపాటు సౌర విద్యుత్ శక్తి లభ్యమవుతుందని కల్లూరు రమేష్ తెలియజేస్తున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే విందాం.