లెనిన్‌కు ఘన నివాళి

0
12 వీక్షకులు

విజయవాడ, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): రష్యన్ విప్లవనేత వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానోవ్ (లెనిన్) జయంతి వేడుకల్ని వామపక్షాలు బుధవారం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా విజయవాడలోని లెనిన్ విగ్రహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు తదితర నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.

అదే విధంగా, విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వద్ద లెనిన్ చిత్రపటానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు, సిహెచ్ బాబూరావు పూలమాలవేసి నివాళులర్పించారు.

లెనిన్ 150వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఉద్ధరాజు రామం భవనంలో లెనిన్ చిత్రపటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. రవి, పి కిషోర్, ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here