వరంగల్‌లో పీవీకి ఘన నివాళి

0
24 వీక్షకులు

వరంగల్, జూన్ 28 (న్యూస్‌టైమ్): భారత పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ బస్టాండ్ కూడలి వద్ద గల పీవీ విగ్రహానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావు తెలంగాణ పేరును ప్రపంచ నలుమూలల వ్యాపింప చేశారన్నారు.

పీవీ సాహసోపేతంగా చేసిన ఆర్థిక సంస్కరణల వల్లనే ప్రస్తుతం దేశం అభివృద్ధిలో పురోగమిస్తోందని, భారతీయ సంస్కృతికి నిలువుటద్దంగా ఆయన నిలిచారన్నారు. భారతీయ భాషల్ని అవపోసన పట్టిన మేధావి పీవీ అని కొనియాడారు. దేశంలో అనేక అగ్ర పదవులు నిర్వహించిన అపర మేధావి పీవీ మూలాలు వరంగల్‌లోనే ఉన్నాయన్నారు.

ఆయన చదువు, సాహిత్య, జీవన, రాజకీయ ప్రస్థానం వరంగల్ నుంచే మొదలయ్యాయని, ఆయన హన్మకొండ ఎంపీగా కూడా పనిచేశారన్నారు. పీవీ జీవితం అందరికీ ఆదర్శమని, పీవీ తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమన్నారు.

శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరి శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here